జివిఎంసి ఫేస్ బుక్, ట్విట్టర్ లో స్వల్ప మార్పు:కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ

 

విశాఖపట్నం :జివిఎంసికి చెందిన ఫేస్ బుక్, ట్విట్టర్లలో స్వల్ప మార్పు చేసినట్లు జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా లాంటి వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అధికారులను నేరుగా కలవడానికి ఇబ్బందులు  పడుతున్నందున, నేడు ప్రజల యొక్క సమస్యలను, సేవలకు సంబంధించిన విషయాలను త్వరితగతిన అధికారులకు తెలియపరిచేందుకు ట్విట్టర్, ఫేస్ బుక్ మరియు యూ ట్యూబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలకు,  అధికారులకు మధ్య మెరుగైన సేవలు అందించేందుకు  వారిదిగా ఇవి ఎంతగానో  ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ హ్యాండిల్/అక్కౌంట్/ఐ.డి. @gvmc_visakha ను gvmc.visakha గా మార్చబడినదిని కావున, నగర ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సవరించిన  హ్యాండిల్ ను ట్యాగ్ చేయకొనవలసిందిగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *