పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు అందించిన విజయం చారిత్రాత్మకము :ముత్తంశెట్టి

భీమిలి :

ఇటీవలి పరిషత్ ఎన్నికల్లో భీమిలీ నియోజకవర్గంలో ఎంపీపీ, ఎంపీటీసీలుగా విజయం సాధించిన ఆనందపురం, పద్మనాభం, భీమిలీ మండల నాయకులను మంత్రి అభినందించారు. టీడీపీ కంచుకోటలను వైసీపీ బడ్డలుకొట్టిందని.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనే ఇందుకు కారణమని అన్నారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు మండల కార్యాలయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగా నేతలు భావించాలని అన్నారు. భవిష్యత్తులో ప్రజల మన్ననలు పొందే విధంగా పని చేయాలని అన్నారు. ఈక్రమంలో మంత్రికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమాల్లో పద్మనాభం జడ్పీటీసీ సుంకరి గిరిబాబు, భీమిలీ జడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దాట్ల పెదబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్లు బంక సత్యం, కంటుబోతు రాంబాబు, చెల్లూరి పైడప్పడు, మాజీ ఎంపీపీ నగేష్ కుమార్, కోరాడ వెంకటప్పుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పద్మనాభం ఎంపీపీగా కంటుబోతు రాంబాబు, వైస్ ఎంపీపీగా కోరాడ మంజు, భీమిలి ఎంపీపీగా వాసురాజు, వైస్ ఎంపీపీగా.. బోని బంగారు నాయుడు, ఆనందపురం ఎంపీపీగా మజ్జి శారదా ప్రియాంక, వైస్ ఎంపీపీగా పాండ్రంగి శ్రీను ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed