మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన విశాఖ నగర మేయర్

 

విశాఖపట్నం : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.  మంగళవారం ఆమె రెండవ జోన్ 11వ వార్డు పరిధిలోని గాంధీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సుమారు  వైద్య శిబిరానికి 200 మందికి పైగా రోగులు వచ్చారని,  ప్రతి ఒక్కరికి బి.పి, షుగరు, ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి, రోగులకు తగిన వైద్య సలహా ఇచ్చారని తెలిపారు.  ఈసందర్భంగా మెడికవర్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి నుండి బి. నాగరాజు, కె. ధర్మతేజ, రాకేష్, తేజ శ్రీ,  సంధ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు. శ్రీనివాసరావు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed