ఎన్ఏడిలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభం

— అందుబాటులో 18 రాష్ట్రాల ఉత్పత్తులు
–చేనేత విక్రయాలను ప్రోత్సహించండి.
–జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్
విశాఖపట్నం: మెగా విశాఖ నగరంలో నామ మాత్రం ధరలకే అనేక రాష్ట్రాల ఉత్పత్తులు లభించడం అభినందనీయమని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ ఎస్ఏడీ జంక్షన్లో ఆలిండియా క్రాఫ్ట్ బజార్‌ను ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ఎన్‌ఏడి జంక్షన్లో నెల రోజుల పాటు క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతీ ఒక్కరూ చేనేత కళాకారులను ఆదరించే దిశగా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిధిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకే విక్రయిస్తుండడంతో వినియోగదారులకు తక్కువ ధరలకే లభ్యం కానున్నట్లు చెప్పారు. స్పెషల్ క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకేచోటకు తెచ్చి విక్రయిస్తుండడం ప్రశంసనీయమన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన చీరలు, షర్టులు, దోవతులు, బెడ్ షీట్లు, కారె ట్లతో పాటు, కలంకారి పెయింటింగ్స్, హైదరాబాద్ మంచి ముత్యాలుతో కలుపుకొని వందలాది రకాల గృహోపకరణ వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంచారు. విశాఖ ఆర్టీసీయన్ డెవలెప్మెంట్ సోసైటీ అధ్యక్షులు మహ్మద్ రసీద్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో అనేక రకాల వస్తువులు ప్రజలను ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. అగరబత్తులు. ఏటికొప్పాక బొమ్మలు, రాజస్థాన్ బెడ్సిట్లు అందుబాటులో ఉంచారన్నారు. ఎగ్జిబిషన్ సెక్రటరీ మహ్మద్ సలీమ్ ఆయా వస్తువులను అతిధులకు చూపించారు. వ్యాపారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్. గంటశ్రీనుబాబులను ఘనంగా సత్కరించారు. నెల రోజుల పాటు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *