స్పంద‌న కార్యక్రమానికి వచ్చిన ఫిర్యా దు లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి:జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున

విశాఖ‌ప‌ట్నం : స్పంద‌న కార్యక్రమానికి వచ్చిన ఫిర్యా దు లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున అధికారులకు సూచించారు.  క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో నిర్వహించిన “స్పందన”కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వచ్చిన
ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించారు. స్పందన కార్యక్రమంలో 254 అర్జీలు వచ్చాయి. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్లు ఎం .వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్.గోవింద‌రావు మరియు జిల్లా అధికారులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *