ద్వారంపూడిని అభినందించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

 

విజయవాడ :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి భాస్కర రెడ్డిని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభినందించారు. విజయవాడ కానూరులోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంస్థ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్ భాస్కర రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, ద్వారంపూడి చంద్రశేఖర్, సామినేని ఉదయభాను, తోట త్రిమూర్తులు, జ్యోతుల చంటిబాబు, రాపాక వరప్రసాద్, దాడిశెట్టి రాజ, పర్వత పూర్ణచంద్రప్రసాద్, అంబటి రాంబాబు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ అమ్మాజీ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టరు యస్ డిల్లీరావుతో కలిసి మంత్రి కొడాలి నాని ద్వారంపూడి భాస్కర రెడ్డికి పుష్పగుచ్చాలను అందించి అభినందనలు తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed