సహకార కేంద్ర బ్యాంక్ కృష్ణాజిల్లా చైర్మన్ తన్నీరును అభినందించిన మంత్రి కొడాలి నాని*

 

*బ్యాంకు అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచన*

మచిలీపట్నం :
సహకార కేంద్ర బ్యాంక్, కృష్ణా జిల్లా చైర్మన్ గా మచిలీపట్నంలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన తన్నీరు నాగేశ్వరరావును రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభినందించారు. మరో మంత్రి రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి మంత్రి కొడాలి నాని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుకు మంత్రి కొడాలి నాని పుష్పగుచ్ఛం అందజేశారు. జ్ఞాపికను బహూకరించారు. సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధికి తన్నీరు నాగేశ్వరరావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని చెప్పారు. అనంతరం బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు, విద్యార్థులకు సేవలు చేస్తానని అన్నారు. బ్యాంక్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ, బ్యాంక్ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు. ప్రభుత్వం తన మీద పెట్టిన బృహత్తర బాధ్యతను సక్రమంగా నిర్వహించి బ్యాంక్ పురోభివృద్ధికి పాటుపడతానన్నారు. త్వరలో 100 పోస్టులకు గాను ఆగస్ట్ 2,3 తేదీల్లో పారదర్శకంగా నిర్వహిస్తామని, దళారుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, నాగేశ్వర రావు అన్నారు. రాత పరీక్షలలో ఉత్హెర్ణులైన 28 మందికి మాత్రమే బోర్డ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, మిగిలిన పోస్టులు రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేస్తామని అన్నారు. జిల్లాలోని మంత్రుల, శాసన సభ్యులు సహకారంతో బ్యాంక్ పురోభివృద్ధికి పాటుపడతామని, డిపాజిట్ల సేకరణ, 10 వేల నుండి 40 లక్షల వరకు లోన్స్ ఇస్తామని, విద్యా రుణాలు, రైతులకు కర్షక మిత్ర లోన్లు ఇస్తామని, సహకార వ్యవస్థని పటిష్టం చేస్తామని, అన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తదితరులు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed