పరీక్షలు రద్దు సంతోషం : లోకేష్‌

అమరావతి : రెండు నెలల పోరాటం తరువాత సిఎం దిగొచ్చి పరీక్షలు రద్దు చేయడం సంతోషమని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. టిడిపి నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కూడా పరీక్షల రద్దు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల్లో భాగస్వామ్యమయ్యే సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed