దుకాణాలను పడగొట్టారు.. చిరువ్యాపారులు కంటతడిపెట్టారు..

 విశాఖ : సుమారు మూడు దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలను అధికారులు పడగొట్టడంతో చిరువ్యాపారులు లబోదిబోమంటున్నారు. శుక్రవారం ఉదయం జివిఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎల్‌ఐసి భవనానికి సమీపంలో ఉన్న పండ్ల దుకాణాలను తొలగించారు. జివిఎంసి టౌన్‌ ప్లానింగ్‌ ఎసిపి అమ్మాజీ ఆధ్వర్యంలో ఈ దుకాణాలను పడగొట్టారు. సుమారు మూడు దశాబ్దాలుగా అక్కడ వ్యాపారాలను నిర్వహిస్తూ 32 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కసారిగా దుకాణాలు కూలదోయడంతో ఉపాధి కోల్పోయిన చిరు వర్తకులు రోదించారు. గతంలో ఒకసారి ఈ దుకాణాల తొలగింపుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో శాసన సభ్యునిగా ఉన్న ద్రోణంరాజు శ్రీనివాసరావు పండ్ల వర్తకులకు బాసటగా నిలిచారు. ఎక్కువ స్థలం కాకుండా తక్కువ స్థలంలో వ్యాపారాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఎల్‌ఐసి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యకు ఉపక్రమించింనట్లు టూటౌన్‌ పోలీసులు చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed