చీడికాడ : చీడికాడ మండలం కోణాం పంచాయతీ గదబోరు, కొండ కొత్తూరు, పీనాడ గ్రామాల గిరిజనులకు నేచర్‌ ఎన్జీవో సంస్థ ఆధ్వర్యాన గురువారం మాస్కులు, శానిటైజర్లను పంపిణీచేశారు. హిందుస్థాన్‌ బేవరేజ్‌, కోకో కోలా, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో వీటిని అందించినట్లు సోషల్‌ వర్కర్‌ ఎం.రమేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌ఐ చిన్న దేవుడు, సిహెచ్‌ అప్పారావు, సిపిఎం నాయకులు పేరయ్య, డిఆర్‌జి వాసు, నేచర్‌ సంస్థ మేనేజర్‌ ఎం సుభాష్‌, చలం తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : నర్సీపట్నం మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చింతకాయల అనిత, మాజీ వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు సమకూర్చిన శానిటైజర్లు, మాస్క్‌లు, హ్యాండ్‌గ్లౌజులను బుధవారం నర్సీపట్నం టౌన్‌ పోలీసులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి, సిఐలు స్వామినాయుడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed