హాలీవుడ్ కు వెళ్లిన మొదటి సౌత్ స్టార్ మెగాస్టార్

ఇండియన్ సినిమాలు ఇంగ్లీష్ లో డబ్బింగ్ అవ్వడం ఈమద్య చాలా కామన్ అయ్యింది. ఇండియన్ సినిమాలు హాలీవుడ్ లో హాలీవుడ్ సినిమా లు ఇక్కడ డబ్బింగ్ అవ్వడం ఇప్పుడు కామనే కావచ్చు కాని మూడు దశాబ్దాల క్రితం ఇండియన్ సినిమా లు ఇంగ్లీష్ లో డబ్బింగ్ అవ్వడం అంటే చాలా పెద్ద విషయం. హిందీ సినిమాలు ఒకటి రెండు డబ్బింగ్ అయిన సమయంలో సౌత్ ఇండియా నుండి డబ్ అయిన మొదటి సినిమా కొదమ సింహం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కౌబాయ్ సినిమా ను ఇంగ్లీష్ లో డబ్ చేశారు.సౌత్ నుండి ఇంగ్లీష్ లో డబ్ అయ్యిన మొదటి సినిమా గా కొదమ సింహం రికార్డు సాధించింది. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా కొదమ సింహంను ఇంగ్లీష్ ఆడియోతో హంటర్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ పేరుతో ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా చిరంజీవి నటించిన ఈ సినిమా కు అక్కడ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొదమ సింహం సినిమాలో చిరంజీవి కౌబాయ్ గా నటించి ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలు మరియు నిధి కోసం జరిగే అన్వేషణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ వారు ఈ సినిమా ను సక్సెస్ చేశారు.చిరంజీవి నటించిన కొదమ సింహంతో పాటు ఇంకా పలు సినిమాలు కూడా ఇంగ్లీష్ మరియు ఇతర విదేశీ భాషల్లో డబ్బింగ్ అయ్యాయి. స్వయం కృషి సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడి అరుదైన గౌరవంను దక్కించుకుంది. ఆరు పదుల వయసు దాటినా కూడా చిరంజీవి ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. చిరంజీవి నుండి మరెన్ని అరుదైన సినిమాలు వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed