ప్రత్యేక హోదా సాధనకై ప్రధాని ఇంటి ముందు ధర్నాలు చేయాలి: చలసాని శ్రీనివాస్

విశాఖ :

 ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ప్రధాని ఇంటిముందు ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులంతా ధర్నాలు చేస్తూనే ఉండాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం విశాఖలోని ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీలు రాజీనామాలు చేయాలనే డిమాండ్ వలన ఏమి ప్రయోజనం లేదని, తక్షణమే 34 మంది ఎంపీలందరూ కలిసి పార్లమెంట్ ముందు గానీ లేక ప్రధాని ఇంటి ముందు గాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే వరకు  ధర్నాలు చేస్తూనే ఉండాలని తద్వారా మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం కనీసం ఒక్క తెలుగు వ్యక్తికి కూడా కేంద్ర కేబినెట్ హోదా మంత్రిగా కూడా లేకపోవడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపిలలో ఒక్కరికైనా కేంద్ర కేబినెట్ లోనికి తీసుకొని అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర వనరులను గుజరాతీలకు అడ్డంగా అమ్ముతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో పెట్రోలియం సంస్థ తలపెట్టిన సుమారు 100 ఆక్సిజన్ ప్లాంటులలో ఏ ఒక్క ప్లాంట్ ని కూడా తెలుగు రాష్ట్రాలలో నెలకొల్పకపోవడం దుర్మార్గమైన చర్య అని, ఇది వివక్షతకు నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక సంస్థగా అభివర్ణిస్తే మాత్రం తీవ్రంగా స్పందించవలసిన వస్తుందని, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారం ఏర్పాటులో ఉమ్మడి రాష్ట్రం మొత్తం ప్రజల త్యాగాలు దాగి ఉన్నాయని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు సాధనకోసం కోవిడ్ పరిస్థితులు తగ్గిన తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో సాధన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గొలివి అప్పలనాయుడు మాట్లాడుతూ గంగవరం పోర్ట్ వాటాల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు.  ప్రస్తుతం ఈ చర్యను నిలువరించగలిగితే రాష్ట్రానికి త్వరలోనే మూడు, నాలుగేళ్ళలో వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సాధనా సమితి సహాయ కార్యదర్శి కనిశెట్టి సురేష్ బాబు, అప్పలరాజు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed