ఆసుపత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు: సిఎం ఆదేశం

అమరావతి : ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోటీపడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. వైద్యఆరోగ్యశాఖలో నాడునేడు, కోవిడ్‌ నిర్వహణ తదితర అంశాలపై సోమవాం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆస్పత్రుల ప్రమాణాల విషంలో ఎక్కడా రాజీపడకూదన్నారు. అనుకోని ప్రమాదాలు జరిగితే రోగులను ఖాళీచేయించే ఎమర్జెన్సీ ప్లాను కూడా ఉండాలని తెలిపారు. కార్పొరేట్‌ ఆస్పత్రులను అనుసరించే ప్రోటోకాల్‌పై అధ్యయనం చేయాలని తెలిపారు. అలాగే కొత్త వైద్య కళాశాలల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరగాలని తెలిపారు. పనుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గిందని, రివకరీరేటు 95.93 శాతానికి చేరిందని తెలిపారు. 2,772 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకగా 922 మందికి సర్జరీలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,37,42,417 డోసుల వ్యాక్సిన్లు వేశామని, వీటిల్లో 82.77 లక్షల మందికి మొదటిడోసు, 27.32 లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు అధికారులు సిఎంకు తెలిపారు. జూన్‌ 20న నిర్వహించిన మెగాడ్రైవ్‌లో 13,72 లక్షలమందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని వివరించారు. రికార్డుస్థాయిలో వ్యాక్సిన్లు వేసిన వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి సిఎం అభినందనలు తెలిపారు. మరిన్ని వ్యాక్సిన్లొస్తే మరోసారి మెగాడ్రైవ్‌ నిర్వహించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed