రెండు మందుబిళ్లలతో నాకు కరోనా తగ్గింది: కేసీఆర్

గత ఏడాది దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న సమయంలో తెలుగు రాష్ట్ర సీఎంలు కేసిఆర్ వైఎస్ జగన్ వ్యాఖ్యలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి. వైరస్ ను నియంత్రించడానికి కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ సరిపోతుందని బ్లీచింగ్ పౌడర్ వైరస్ ను చంపగలదని జగన్ చెప్పారు. కేసీఆర్ జగన్ ఇద్దరూ కూడా పారాసిటమాల్ వేసుకుంటే కరోనా ఖతం అవుతుందని చెప్పుకొచ్చారు. వీరిద్దరిపై నాడే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మాట అన్నందుకు ట్రోల్ చేశారు.అదే ‘పారాసెటమాల్’ డైలాగ్ను తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పఠించారు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసీఆర్ సోమవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్తో పోల్చితే వరంగల్లో మెరుగైన వైద్య సదుపాయాలు ఉండాలని ఈ ఆసుపత్రి నిర్మాణం ఒకటిన్నర సంవత్సరంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి గురించి మాట్లాడారు. “కోవిడ్ -19 గురించి చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. దీనికి ఇంకా ఔషధం లేదు. నాకు కూడా కరోనా వచ్చింది.  దాని నుండి విజయవంతంగా కోలుకున్నాను. నేను వైద్యులు సూచించిన పారాసెటమాల్ తీసుకున్నాను. రెండు మందుబిళ్లలతో నాకు తగ్గింది” అని కేసీఆర్ అన్నారు.కేసీఆర్ నుండి వచ్చిన తాజా వ్యాఖ్య మరోసారి వైరల్ గా మారింది. వాస్తవం ఏమిటంటే కోవిడ్ -19 వివిధ లక్షణాలతో వస్తుంది.. లక్షణాన్ని ఎదుర్కోవటానికి పేర్కొన్న భిన్నమైన పలు రకాల ఔషధాలు అవసరం. కేవలం జ్వరానికి మాత్రమే వేసుకునే పారాసిటమాల్ వాడుతారు. కేసీఆర్ మాత్రం జ్వరం గోళీలతో  కోవిడ్ -19 నుండి కోలుకున్నానని అన్నట్టుగా మీడియాలో ప్రచారం అవుతోంది. అదే జరిగితే మరోసారి కేసీఆర్ పై నెటిజన్లు ట్రోల్స్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed