జివిఎంసి కి ఆక్షిజన్ కాన్సంట్రేటర్ల ను వితరణ

????????????????????????????????????

       

 

విశాఖపట్నం : జివిఎంసికి 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లు ఆసరా ఫౌండేషన్ వారు ఉచితంగా అందించారు. కోవిడ్ బారిన పడిన రోగులకు ఆక్షిజన్ అందించాలనే సంకల్పంతో రూ.56 లక్షల విలువైన 50 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు సోమవారం జివిఎంసి కమిషనర్                      డా. జి. సృజనను  ఆమె ఛాంబార్లో కలసి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆక్షిజన్ కాన్సంట్రేటర్లు అందించినందుకు ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులకు కమిషనర్ అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. ముడసర్లోవ కోవిడ్ సెంటర్లో చేసిన కోవిడ్ రోగులకు చేసిన సేవలకు ముగ్దులై వీటిని అందించారు. వీటిలో 40 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను ముడసర్లోవ కోవిడ్ సెంటర్ నకు, 10 ఆక్షిజన్ కాన్సంట్రేటర్లను జివిఎంసి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించామని కమిషనర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి కోవిడ్ నియంత్రణకు సహాయ సహకారాలు అందించాలన్నారు. 

   ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రెసిడెంట్ రామారావు, జాయింట్ సెక్రటరి వినయ్ మొదలైన వారు పాల్గొనగా జివిఎంసి నుండి అదనపు కమిషనర్ డా. వి.సన్యాసి రావు, ముడసర్లోవ కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి డా. కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed