టీడీపీ నాయకులు దృష్ప్రచారం మానుకోవాలి :గాజువాక వైసీపీ కార్పొరేటర్లు

గాజువాక :
మంచి పనిని హర్షించడం మానేసి తెలుగు దేశం పార్టీ నాయకులు వ్యాక్షిన్ విషయంలో దుష్ప్రచారాలు చేయటం మానుకోవాలని జీవీఎంసీ వైస్సార్సీపీ కార్పొరేటర్ లు తిప్పల వంశీ రెడ్డి, బి. ఎన్. పాత్రుడు (కేబుల్ మూర్తి) అన్నారు. గాజువాకలో జరిగిన విలేఖరుల సమావేశంలో వైస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలకి కులాలకి అంతీతంగా కార్యక్రమాలు చేస్తుంటే ప్రశంశించాల్సింది పోయి విమర్శలు చేయటం తగదని అన్నారు. ప్రజా ఆరోగ్యం విషయంలో జగన్ మోహన్ రెడ్డి బృహత్తర కార్యక్రమం చేస్తే వ్యాక్సిన్ వేస్తున్నారనే విషయాన్ని తెలుగు దేశం పార్టీ వక్రదృష్టితో చూడటం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్పొరేటర్లు ఉరుకూటి చందు, రాజనా రామారావు, వైస్సార్సీపీ కో ఆప్షన్ సభ్యురాలు
శ్రీమతి.పల్లా చిన్నతల్లి,
ధర్మాల. శ్రీను,బొడ్డా.గోవింద్, చిత్రాడ. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed