వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కమిషనర్:డా. వి. సన్యాసిరావు

 

 

విశాఖపట్నం :- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు పరిశీలించారు. ఆదివారం ఆయన అల్లిపురం, 32వ వార్డు లోని సచివాలయం, 35వ వార్డు ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని సచివాలయం, జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివిఎంసి పరిధిలోని అన్ని సచివాలయాలలో వ్యాక్సినేషన్ జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ఈ రోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తిచేయాలని అందుకు జివిఎంసి అధికారులు, డాక్టర్లు, నర్సులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు మొదలైనవారు ఇందుకు పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రతి వాలంటీర్లు, వారి పరిధిలో ఉన్న 50 ఇళ్లలోని వ్యాక్సినేషన్ వేయించుకోలేని వారిని దగ్గరుండి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించి వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. అనంతరం, జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించి వ్యాక్సినేషన్ జరుగు పక్రియను, వాటి నమోదును పరిశీలించారు.

 

ఈ పర్యటనలో 4వ జోనల్ కమిషనర్ పణిరాం, శానిటరి సూపర్వైజర్  శ్రీనివాస్ రాజ్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed