• హైదరాబాదులో విశాల్ 31 షూటింగ్
  • విశాల్ తలకు తగిలిన సీసా
  • ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్
  • టైమింగ్ తప్పిందన్న విశాల్

మాస్ హీరో విశాల్ 31వ చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా సాగుతోంది. అయితే, ఓ ఫైటింగ్ సీన్ లో హీరో విశాల్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డూప్ లేకుండా ఫైటింగ్ సీన్లో నటిస్తున్న విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే ఆయనకు పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. విశాల్ ఆ ఫైట్ సీక్వెన్స్ ను బ్రేక్ తీసుకోకుండా కొనసాగించడం విశేషం. విశాల్ పాల్గొన్న ఫైట్ దృశ్యాలు సెట్స్ పై ఉన్న మానిటర్ లో  చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ… కొద్దిలో తప్పించుకున్నానని వెల్లడించారు. ఆ ఫైటర్ తప్పేమీలేదని తెలిపారు. కొంచెం టైమింగ్ తప్పిందని, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని పేర్కొన్నారు. భగవంతుడి నిర్ణయం, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని విశాల్ వెల్లడించారు. కాగా, విశాల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. పి. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.