ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం  రూపొందించిన  పదకోశం – మీకోసం పుస్తకం ఆవిష్కరణ

????????????????????????????????????

 

విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం  రూపొందించిన  పదకోశం – మీకోసం పుస్తకం  చాలా ఉపయుక్తంగా ఉన్నదని  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు  తెలిపారు.   శుక్రవారం నాడు  ఆంధ్ర విశ్వవిద్యాలయం  హిందీ భవన్  సెమినార్ హాల్ లో  ఈ పుస్తకాన్ని  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ  అధికార భాషా సంఘం  కార్యాలయాన్ని  విశాఖలో  పెడతామని అన్నారు. రాజ్యసభ సభ్యులు  వి. విజయసాయి రెడ్డి  మాట్లాడుతూ  ఒక భాషలోని పదానికి మరొక భాషలో  సరియైన  అర్దాన్ని ఇచ్చేలా పదాలను  తర్జుమా చేయడం  కష్టమైన పని అని,  ఈ పదకోశం రూపకల్పన  అభినందనీయమని  అన్నారు.  ఆంధ్రవిశ్వవిద్యాలయం కులపతి ఆచార్య పి వి జి డి  ప్రసాదరెడ్డి మాట్లాడుతూ  అధికారికంగా  ఉపయోగించే  పదాలతో  పదకోశం రూపొందించారని   అన్నారు. అధికార భాషా సంఘం  చైర్మన్  ఆచార్య యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్  మాట్లాడుతూ  తెలుగును పాలనా భాషగా అమలు చేసేందుకు  చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో  అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు,  ఆచార్య  షేక్ మస్తాన్, ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిష్ట్రార్, ఉపాధ్యాయులు , ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed