ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలు:2021-22 జాబ్ క్యాలెండర్ విడుదల

 


విశాఖపట్నం : తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం తీసుకువస్తూ 2021-22 జాబ్ క్యాలెండర్ ను ముఖ్యమంత్రి వై.ఎస్.  జగన్ మోహన్ రెడ్డి  విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 10వేల 143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అత్యధిక ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇకపై గ్రూపు-1 గ్రూపు-2 సహా అన్ని ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ఉద్యోగాల్లో 2 లక్షల 59 వేల 565 మందికి ఉద్యోగ నియామకాలు చేసినట్లు తెలిపారు.  2019 నుండి ఇప్పటి వరకు 3,99,791 నియామకాలు చేయడం జరిగిందన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్ బాబు, ఆర్.గోవిందరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed