* విశాఖను సుందరవనం చేస్తా….

* మురికివాడ‌ ర‌హిత‌ విశాఖ‌ మా లక్ష్యం

* విశాఖ అబివృద్ది ప‌నులు,ఆదాయ వ‌న‌రుల అభివృద్ది

విశాఖపట్నం :
విశాఖ నగరంలో జరుగుతున్న అభివృద్ది ప‌నుల‌పై గురువారం రాజ్య‌స‌భ స‌భ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి. విజ‌య‌సాయి రెడ్డి,మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీ‌నివాస్ లు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాఖ అభివృద్ది ప‌నులు,ఆదాయ వ‌న‌రుల అభివృద్ది తదితర అంశాల‌పై జివిఎంసి అధికారుల‌తో ఈ సమావేశంలో చర్చించారు. మీడియా స‌మావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ
మురికి వాడ‌ ర‌హిత‌ విశాఖ‌ప‌ట్నం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌ల‌. ఆ కల నెరవేర్చేందుకు
మురికివాడ‌లలో మౌళిక సాదుపాయల కల్పనకు కృషి చేస్తున్నాము. జివిఎంసి ఎన్నిక‌ల‌లో ఇచ్చిన హామీల‌కు అనుగుణంగా ప‌ట్ట‌ణ ప‌రిధిలోని 790 పైచిలుకు మురికివాడ‌ల‌లో మౌళిక స‌దుపాయాలు అభివృద్ది చేస్తామన్నారు.
ప్ర‌భుత్వ, ప్రైవేటు స్థ‌లాలలో ఉన్న మురికి వాడల్లో ఏళ్ల త‌ర‌బ‌డి నివసిస్తున్న వారంద‌రికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తాం.
విశాఖ నగరంలో దివంగ‌త ముఖ్యమంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హాయంలో నిర్మించిన నిరుపేద గృహా స‌ముదాయాల‌కు మ‌రమ్మత్తులు చేప‌డతాం. ఒక్కో ఇంటికి 10వేల రూపాయ‌ల‌తో చొప్పున కేటాయించి మర‌మ్మ‌త్తులు చేప‌డ‌తాం.
కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు రైల్వే, పోర్టు,నేవికి చెందిన సంస్థ‌లలో ఉన్న మురికి వాడలకు చెందిన ఆస్తుల‌లో మురికి వాడ‌లకు… ఎటువంటి ఇబ్బందులు క‌ల్గించ‌కుండా ఆయా కేంద్ర, ప్రభుత్వ సంస్థ‌ల‌తో మాట్లాడి వారికి రాష్ట్ర ప్రభుత్వ భూమిని ప్ర‌త్య‌మ్నాయ స్థ‌లాలు బదలాయిస్తాం.విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు తగ్గట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు కూడా శరావేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఇంటిప‌న్ను పెంపుపై ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌న్నుపై 5 నుండి అత్య‌ధికంగా 15 శాతం వ‌ర‌కు మాత్ర‌మే పెంచ‌డం జ‌రుగుతుంది. జివిఎంసి ప‌రిధిలోని 8 జోన్ల‌లో కన్వెన్షన్ సెంట‌ర్లు నిర్మించుట‌కు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేశాం.1000 మందికి స‌రిప‌డేట‌ట్లుగా ఒక్కో కన్వెన్షన్ సెంట‌ర్ ను 5 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మించ‌డం జ‌రుగుతుంది. ..
రానున్న మూడు సంవ‌త్స‌రాల‌లో ఈ నిర్మాణాలు విడ‌ల‌త వారీగా పూర్తి చేస్తాం.

అందుకు సంబందించిన కొంత మేర‌ నిధులను నా ఎంపి ల్యాడ్ నిధుల నుండి కేటాయించ‌డం జ‌రుగుతుంది. మిగిలిన మొత్తాన్ని సి.ఎస్.ఆర్ నిధుల నుండి ఏర్పాటు చేస్తాం.

కేంద్ర ప్ర‌భుత్వ సంస్థల నుండి అప్పులు తేవడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ఆస్థులు చూపించాల్సి ఉంటుంది. ఇది స్వ‌తంత్ర్యం వ‌చ్చిన నుండి వివిధ ప్ర‌భత్వాలు అభిలంబిస్తున్న విధాన‌ం…

దీనిని ఈ రోజు మా ప్రభుత్వం కొత్త‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆస్తులు త‌న‌ఖా పెడుతున్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు.

విశాఖ‌నగరానికి త్రాగునీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు పైపులైను ద్వారా ఏలేరు రిజర్వాయర్ నుండి లేదా పోల‌వరం నుండి నీరు అందించేదుకు పైప్ లైన్ నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసాం.
సుమారు 3500 కోట్ల నుండి 5వేల కోట్లతో ఈ ప‌నులు ప్రారంభించనున్నాము.

ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జ‌గ‌న్మొహ‌న్ రెడ్డి చేతులు మీదుగా ఈ ప్రాజ‌క్టు ప్రారంభం కానుంది.

ఇటీవ‌ల జివిఎంసి ఎన్నిక‌ల‌లో బాగంగా ఇచ్చిన హామీ మేర‌కు కొండ వాలు ప్రాంతాల‌లో ర‌క్ష‌ణ గోడ నిర్మాణం మ‌రియు కొండపైకి ఎక్కేందుకు మెట్లు నిర్మిస్తాం.జివిఎంసి ప‌రిధిలోని మొత్తం 98 వార్డుల‌కు సంబందించి వార్డు అభివృద్ధి ప్రణాళిక ను సిద్ధం చేయ‌డం జ‌రిగింది. ప్ర‌తి వార్డులోని మౌళిక స‌దుపాయాలు రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర అబివృద్ది ప‌నులు చేసేందుకు 5 నుండి 10 కోట్ల మేర ఖ‌ర్చు చేయ‌నున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed