ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య  పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయనను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్‌ 3468 కేటాయించారు. జైల్లోని పాత బ్యారక్‌లో ఒక సెల్‌ను అలాట్‌ చేశారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *