* భయాందోళనలో ఉన్న నగరవాసులను పట్టించుకోరా?
* కరోనా కి  వేసుకోవడానికి వ్యాక్సిన్ లేదు, వస్తే బెడ్లు లేవు, పోతే కట్టెలు లేవు…
* కార్పొరేటర్లూ… పోటీచేసేటప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడెక్కడ?
*వార్డుల్లో ఎక్కడ కానరాని బ్లీచింగ్, హైడ్రోక్లోరైడ్ పిచికారీ
* కార్పొరేటర్లు, అధికారుల నిర్లక్ష్యమా,ప్రజల స్వయంకృత అపరాధమా ?
* దీనికి ఎవరు బాద్యులు ?
*  కానరాని కార్పొరేటర్లపై  ధ్వజమెత్తిన ప్రజలు
విశాఖ :
ప్రజల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్లు  నేడు అదే ప్రజలు కరోనాతో పిట్టల్లా రాలిపోతున్న పట్టించుకొనే నాధుడే లేకపాయే..
కరోనా మహమ్మారి చేస్తున్న  విలయతాండవంతో నగరంలో మరణమృదంగం మొగుతుంది. కరోనా మొదటి దశకంటే రెండోవ దశ చాలా ఉద్రిక్తంగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరికలు జారీ చేసినట్లే సెకండ్ వెవ్ చాలా ఉద్రిక్తంగా మారింది. కరోనా మొదటి వేవ్ ఎన్నికల సమయం కావడంతో కార్పొరేటర్ అభ్యర్థులు పోట పోటీగా వార్డుల్లో తిరిగి సొంత ఖర్చులతో మస్కులు పంచుతూ, గడపగడపకి బ్లీచింగ్ పౌడర్ జల్లిస్తూ ఎటువంటి ఆందోళనలు పడవద్దు అంటూ అవగాహన కలిపిస్తూ వీరే ప్రజాసేవకులు, పెద్ద సంఘ సంస్కర్త లా బిల్డప్ ఇచ్చారు. మరీ ఇపుడు ఉన్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఎందుకు ఎవరు ఎక్కడ కనపడడంలేదు, ఏమైంది మీ ప్రజాసేవ  అంటూ నగరవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. మేము ప్రజలకు సేవ చెయ్యడానికే రాజకీయాల్లోకి వచ్చామని ప్రగల్భాలు పలికిన కార్పొరేటర్ అభ్యర్థులలో గెలిచిన, ఓడిన వారుగాని 20 శాతం మాత్రమే అక్కడక్కడా కనిపిస్తున్నారు. మరి మిగిలిన వారి సంగతేంటో……కొందరు కార్పొరేటర్లు అయితే ఇప్పటికే మా స్థాయికి మించి ఖర్చు చేశామని సమాధానాలు ఇవ్వడం కొసమెరుపు. మరీ కొందరైతే వార్డులో ఉంటూ కూడా కేవలం లాభదాయకమైన పనుల మీదనే దృష్టి సారిస్తున్నారు. ఏ వార్డులోనైతే గెలిచారో ఆ వార్డులోనే కుళ్ళు రాజకీయాలు చేస్తూ అటు స్థానికులను, వ్యాపారస్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ దొరికినంత గుంజుకుంటునట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా సమయంలో చికిత్స అందక, హాస్పిటల్స్ లో బెడ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. దానిని ప్రతిపక్ష, స్వపక్ష అని తేడా లేకుండా కొందరు కార్పొరేటర్లు మాత్రమే అమలుచేస్తున్నారు. మరీ మిగిలిన వారి సంగతేంటో….. ఎలాగూ గెలిచాం అయిదు సంవత్సరాలు వరకు మమ్మల్ని ఎవరు ఏమీ పికుతారనే ధీమాతో  పెట్రేగిపోతున్న సంఘటన కొన్ని వార్డులో జరుగుతున్న విషయాన్ని స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఉదృతంగా ఉన్న ఇటువంటి సమయంలో కనీస బాధ్యతగా వార్డులో బ్లీచింగ్ జల్లించడం గాని, హైడ్రోఫ్లోరైడ్ ద్రావణం చల్లడం వంటి చేయడం లేదని స్థానికులు తమ బాధను  వ్యక్తం చేస్తున్నారు. బడా నాయకులు కార్పొరేటర్లు పై దృష్టి సారించి వార్డులో జరుగుతున్న అవకతవకలను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *