తీవ్ర ఆరోపణలతో రఘురామ అరెస్ట్

  • సీఐడీ కోర్టులో హాజరు
  • ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
  • ఎంపీకి చికిత్స అందించాలని ఆదేశం
  •  గాయాలపై నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాడన్న అభియోగాలపై అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. మొదట ఎంపీ రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీ కోలుకునేవరకు ఆసుపత్రిలోనే ఉంచవచ్చని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స కొనసాగినంతవరకు రఘురామకృష్ణరాజుకు కేంద్రం కల్పించిన వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. తొలుత జీజీహెచ్ లో, ఆపై రమేశ్ ఆసుపత్రిలో మెడికల్ ఎగ్జామినేషన్ చేపట్టాలని నిర్దేశించింది.