వైభవంగా గొర్రె, పొట్టేలుకు కల్యాణం

కేవీపల్లె : మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో ఆదివారం రాత్రి గొర్రె, పొట్టేలు కల్యాణం నిర్వహించారు. ఏటా సంక్రాంతి అనంతరం రెండు రోజులకు జీవాలకు వివాహం జరిపించడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా పంట పొలాలను చీడపీడల నుంచి, గొర్రెలను అంటు వ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్తుల విశ్వాసం. వరుడి వైపు కిరణ్కుమార్, వధువు వైపు దామోదర్ కుటుంబసభ్యులు నిలిచి పెళ్లి తంతును వైభవంగా జరిపించాయి. పెద్దసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.