మహేష్‌కు వదినగా రేణు దేశాయ్‌!

పరశురామ్ ​దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న తాజాచిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాతో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తొలిసారిగా మహేష్‌తో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జనవరి చివర్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే మహేష్‌ అభిమానులు ట్విటర్‌లో సర్కారు వారి పాట అనే హ‍్యష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు వదినగా పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ నటించనున్నట్లు సమాచారం. ఇందుకు ఇప్పటికే చిత్ర బృందం రేణు దేశాయ్‌ని సంప్రదించినట్లు ఫిలీం వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి.  బ్యాంక్ స్కాముల నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్ర కథ సాగనుండటం వల్ల బ్యాంకు వాతావరణంలో ఎక్కువ షూటింగ్ వుండే అవకాశం ఉంది. దాంతో హైదరాబాద్‌, అమెరికాలో ఎక్కువ శాతం షూటింగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకు ఎపిసోడ్లు చిత్రీకరించడానికి రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా సెట్‌ వేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ పూర్తి కాగానే ‌ పూరి జగన్నాథ్‌‌, ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్వకత్వంలో మహేష్ నటించనున్నారని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *