స్క్రీన్ రైట‌ర్ల వివాహం: 2021లో కొత్త ప్రయాణం

గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్‌ ప్రముఖ ‌స్క్రీన్ రైట‌ర్లు క‌నికా ధిల్లాన్‌, హిమాన్షు శ‌ర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు అతి కొద్ది మందే హాజరైనట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట తాజాగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన విషయాన్ని సోమవారం నాడు సోషల్‌ మీడియా సాక్షిగా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా కనికా భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. 2021లో కొత్త ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ నవ దంపతులకు నటి తాప్సీ, మంచు లక్క్క్ష్మీ సహా పలువురు ప్రముఖులు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ‘జ‌డ్జిమెంట‌ల్ హై క్యా’, ‘మ‌న్మ‌ర్జియాన్’ సినిమాల‌తో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న క‌నికాకు గ‌తంలో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కొడుకు ప్ర‌కాష్‌ కోవెల‌మూడితో వివాహం జ‌రిగింది. అయితే వారి జీవితంలో మనస్పర్థలు తొంగి చూడటంతో కొంత‌కాలానికి క‌నికా, ప్ర‌కాష్‌ విడిపోయారు. రియ‌ల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం క‌లిసి ప‌ని చేసేవారు. అలా కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ ‘జ‌డ్జిమెంట‌ల్ హై క్యా’ చిత్రానికి ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, క‌నికా క‌థ‌ను అందించారు. దీనికంటే ముందు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్‌ చేతులు కాల్చుకున్నారు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అత‌నికి పెద్ద‌గా పేరు తీసుకురాలేదు. ఇక హిమాన్షు విష‌యానికి వ‌స్తే.. త‌ను ‘వెడ్స్ మ‌ను’, ‘రాణీజానా’, ‘జీరో’ చిత్రాల‌కు క‌థ అందించిన ఆయ‌న న‌టి స్వ‌ర‌భాస్క‌ర్‌తో కొంత కాలం ప్రేమాయ‌ణం న‌డిపారు. అయితే ఇద్ద‌రు దారులు వేర‌ని తెలుసుకుని ఆ బంధానికి ముగింపు ప‌లికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *