5ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై రవి-లాస్య జోడి

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా రవి-లాస్య జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. టీఆర్పీ రేటింగ్‌లోనూ వీరిద్దరి కాంబో హిట్‌ పెయిర్‌గా నిలిచింది. రవి-లాస్య జోడీకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారంటే వీరిద్దరి కాంబినేషన్‌ ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో చెప్పక్కర్లేదు. సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అప్పటిదాకా టామ్‌ అండ్‌ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.కాగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్యూట్‌ పెయిర్‌ మళ్లీ తెరపై కనిపించనున్నారు.ఈ విషయన్ని స్వయంగా యాంకర్‌ రవి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా వెల్లడించాడు. సంక్రాంతి స్పెషల్‌ వేడుకగా వీరిద్దరితో ‘స్టార్‌మా’ వాళ్లు ఓ షో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ స్పెషల్‌ ఈవెంట్‌ హిట్‌ అయితే రవి-లాస్య కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *