నిహారిక దంపతుల హనీమూన్‌ ప్లాన్‌

కొణిదెల వారింటి గారాల పట్టి, నటి నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా హీరోలు హాజరయ్యారు. స్టార్‌ హీరోలు ఒకేచోట చేరి సందడి చేయడంతో దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత నూతన దంపతులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మధ్యే మెట్టినింట్లో అడుగు పెట్టిన నిహా తొలిసారి భర్తతో కలిసి బర్త్‌డే జరుపుకుంది. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ నిహారికకు చైతన్య వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  తాజాగా ఈ జంట హనీమూన్‌కు ప్లాన్‌ చేస్తోందట. సెలబబ్రిటీల ఫేవరెట్‌ స్పాట్‌ అయిన మాల్దీవులకు వెళ్లడానికి ఈ దంపతులు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే ఈ హనీమూన్‌ 2020 చివర్లో ఉంటుందా? కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉంటుందా? అనేది ఈ కొత్త జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఎందరో సెలబ్రిటీలతో పాటు హీరోయిన్‌ కాజల్‌ దంపతులు కూడా హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే చైతన్య హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మెగా ఫ్యామిలీ నుంచే కాక, మెగా అభిమానుల నుంచి కూడా ఆయనకు ఫుల్‌ సపోర్ట్‌ లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *