బుల్లి అభిమాని కల నెరవేర్చిన బన్నీ

హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినం రోజు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ తన వీరాభిమాని కల నెరవేర్చడంతోపాటు అనాథబాలల్లో సంతోషాన్ని నింపారు. తన బుల్లి వీరాభిమానికి ఆయన ఆటోగ్రాఫ్‌ పంపించడంతో  ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ వితిక షేరు అభ్యర్థన మేరకు ఆటో గ్రాఫ్‌తోపాటు, శాంటా బహుమతులను పిల్లలకు పంపించారు బన్నీ. వీటిని అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ స్వయంగా అనాథాశ్రమాన్ని సందర్శించి పిల్లలతో క్రిస్మస్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. వారితో కలిసిపోయి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు బహుమతులను అందజేయడం విశేషం.  దీంతో ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. థ్యాంక్యూ బన్నీ అన్నా అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు. మెర్రీ క్రిస్మస్‌ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా బన్నీ పిల్లలు అర్హ, అయాన్‌ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తండ్రితో పోటీపడుతూ మరీ అభిమానులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిస్మస్ ట్రీ అలంకారం, మురిసిపోతున్న అల్లు అర్హ  ఫోటోలను  అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోస్‌కు లక్షల సంఖ్యలో వ్యూస్  రావడమే ఇందుకు ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *