అర్జున్‌ను చితక్కొట్టిన సూర్యకుమార్‌.. 47 బంతుల్లో 120

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దేశవాళీ టోర్నీల్లో భాగంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి సిద్ధమవుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ మరొకసారి ట్‌ ఝుళిపించాడు. ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా టీమ్‌-బికి నేతృత్వం వహిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. యశస్వి జైస్వాల్‌ సారథ్యం వహిస్తున్న టీమ్‌-డితో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 120 పరుగులు సాధించాడు. (రైనా, టాప్‌ హీరో మాజీ భార్య అరెస్ట్‌) మ్యాచ్‌ మొత్తం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన సూర్యకుమార్‌ 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో విశ్వరూపం ప్రదర్శించాడు. 250కి పైగా స్టైక్‌రేట్‌తో టీమ్‌-డి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రధానంగా టీమ్‌-డి బౌలర్‌ అర్జున్‌ టెండూల్కర్‌(సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు) వేసిన ఒక ఓవర్‌లో 21 పరుగులు సాధించడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. అర్జున్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో సూర్యకుమార్‌ రెచ్చిపోయి ఆడాడు.తన తొలి రెండు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఈ లెఫ్మార్మ్‌ పేసర్‌.. సూర్యకుమార్‌ హిట్టింగ్‌కు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమ్‌-బి నిర్ణీత 20 ఓవర్లలో213 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *