డి ఎస్ పి తో సమావేశమైన ప్రజా సంఘ నేతలు

అనకాపల్లి :
ప్రజా సంఘాల ప్రతినిధులు అనకాపల్లి డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బూడిద సునీల్ గారితో వారి ఆఫీసులో సమావేశం అవ్వడం జరిగిందని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొట్ట చిన్ని యాదవ్ తెలిపారు, ఈ సమావేశంలో నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ బొడ్డేడ అప్పారావు గారు మాట్లాడుతూ అనకాపల్లిలో డీఎస్పీగా సునీల్ గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ విషయంలో అంకితభావంతో పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని సహచర అధికారులకు ఆదర్శప్రాయం అయ్యారని అభినందించారు, అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆళ్ళ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డి ఎస్ పి సునీల్ గారి జీవిత కథ నేటి యువతకు ఎంతో ఆదర్శదయకమని, ఇటువంటి మహోన్నత విలువలు కలిగిన యువకుడు అనకాపల్లిలో డిఎస్పీగా జాబ్ చేయడం అనకాపల్లికి మంచి పరిణామమని అన్నారు…. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధులు డిఎస్పి గారికి రేపు జరగబోవు రిపబ్లిక్ డే వేడుకలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు..