దోమల నివారణపై విస్తృతంగా అవగాహన పెంచండి:జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన        

????????????????????????????????????

 

 

విశాఖపట్నం :విశాఖ నగర ప్రజల ఆరోగ్య దృష్ట్యా, జివిఎంసి పరిధిలో దోమల వృద్ధిని అరికట్టుటకు, దోమల నివారణపై విస్తృతంగా అవగాహన ప్రజలలో పెంచాలని  జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూకోవిడ్-19 వ్యాధి నుండి నగరంలో ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారన్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా లాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాకాలపు నీటి నిల్వలలో దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులకు కారణమవుతాయన్నారు. వీటిని అరికట్టుటకు నివారణ చర్యలు ఒక్కటే మార్గమని కమిషనర్ తెలిపారు. ఈ విషయమై, ప్రతి రోజు ఇంటింటికి మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల సర్వే ద్వారా దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహనపరిచే కార్యక్రమాలను జివిఎంసి చేపడుతునే వుందని అన్నారు. దోమల నివారణకు జివిఎంసి సిబ్బంది చేస్తున్న సర్వేకు ప్రజలందరూ సహకరించాలని, ప్రజలు తమ వంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి శుక్రవారం విధిగా ప్రతి ఇంటిలో “డ్రై డే“ను పాటించాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జివిఎంసి నిత్యం కృషి చేస్తూనేవుందని కమిషనర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *