డెంగ్యూ కేసులు నమోదు అవ్వకుండా చర్యలు చేపట్టండి:జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన 

????????????????????????????????????

 

విశాఖపట్నం :- నగరంలో డెంగ్యూ కేసులు నమోదు అవకుండా తగు చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మలేరియా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆమె 3వ జోన్ నందు 18వ వార్డు పరిధిలోని ఎంవిపి లోని ఫిషర్మెన్ కోలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఫిషర్మెన్ కోలనీలో డెంగ్యూ కేసు నమోదైన ఇంటికి వెళ్లి వారి యోగ క్షేమాలను  అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంటి చుట్టూ 200 మీటర్ల వరకు స్ప్రేయింగు చేయించాలని, డెంగ్యూ కేసులు నమోదు అవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి వ్యాప్తిని నివారించాలని ఎఎంఒహెచ్ ను, వెటర్నరి డాక్టరును ఆదేశించారు. వార్డు సచివాలయ హెల్త్ కార్యదర్శులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మలేరియా సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, ఇంటి గోడపై సందర్శించినట్లు వారి సంతకం పెట్టాలని ఆదేశించారు. రోడ్డుపైన,  బహిరంగ ప్రదేశాల్లో చెత్త అధికంగా పడుతుందని, చెత్త పడకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోలనీలో రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచాలని, వెనువెంటనే వ్యర్ధాలను  డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, 3వ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, కార్య నిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, సుధాకర్, ఎం. శ్రీనివాస్, బయాలజిస్ట్ దొర,       ఎఎంఒహెచ్ డా. రమణమూర్తి, శానిటరీ సూపర్వైజర్ జనార్దన రావు, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *