సఫారీలపై విండీస్‌దే తొలి టి20

సిక్సర్లతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ విరుసుకుపడ్డారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టిా20లో ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (35 బంతుల్లో 71), యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 32), ఆండ్రీ రసెల్‌ (12 బంతుల్లో 23), ఆండ్రీ ఫ్లెచర్‌ (19 బంతుల్లో 30) సిక్సర్లతో మోత మోగించడంతో విండీస్‌ 160 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. 5 టిా20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అతిధ్య జట్టు సఫారీలను మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

విండీస్‌ టాస్‌ గెలిచి తొలుత ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వాన్‌డర్‌ డుసెన్‌ (38 బంతుల్లో 56 పరుగులు), వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ డికాక్‌ (24 బంతుల్లో 37) రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. విండీస్‌ బౌలింగ్‌లో ఫాబియన్‌ అలెన్‌, బ్రావోలకు తలో రెండు వికెట్లు, హోల్డర్‌, రసెల్‌కు చెరో వికెట్‌ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. కేవలం 15 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సఫారీ బౌలర్‌ షంషికి ఓ వికెట్‌ దక్కగా, ఫ్లెచర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టిా20 ఆదివారం జరగనుంది. కాగా, సఫారీలతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఆతిథ్య జట్టు 0-2 తేడాతో కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *