నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు నిరసన

విశాఖపట్నం :
పీసీసీ అధ్యక్షులు డా.సాకే శైలజానాథ్ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు కేంద్రప్రభుత్వం విధానాలుకు నిరసనగా సిరిపురం పెట్రోల్ బంకు వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది
ఈ వజ్జపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల పట్ల రాక్షస పాలన చేస్తూ పెట్రోలు డీజీల్ మరియు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచి ప్రజలకు బారమైన పరిపాలన చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం పై ద్వజమెత్తారు మనకు ప్రత్యేక హోదా తో పాటు ప్రజలకు సుస్థిరమయిన పాలన అందుతుంది అని తెలియజేసారు అదేవిధంగా మహిళ అధ్యక్షురలు మాట్లాడుతూ దేశం లో ఇటు రాష్ట్రం లో పాలన తో ప్రజలు విసిగిపోయి కొత్త పాలన కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు అని కొనియాడారు,యువజన కాంగ్రెస్ శివకుమార్ మాట్లాడుతూ యువతకి అండగా ఉంటాం అని గద్దె ఎక్కి ఈ నాడు యువతకి ఏటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు అలాగే, ప్రజలు తిండి లేక మన ఇబ్బందులు పడుతుంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమో లిక్కర్ మాఫియాను చేస్తూ ప్రజల జెబులను కొల్లగొడుతున్నారు అను అన్నారు
ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి శ్రీనివాసరావు , పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ రావు,పీసీసీ బీసీసెల్ వైస్ చైర్మన్ మూలవెంకట రావు,సిటీ మహిళ అధ్యక్షురాలు సునందా దేవి, పీసీసీ కార్యదర్శి సోదదాసి సుధాకర్,రాష్ట్ర యువజన కాంగ్రెస్ శివకుమార్, సేవదళ్ బొమ్మిడి గంగాధర్ ,
కస్తూరి వెంకట్రావు,ఇంటక్ తమ్మిననాయుడు గారు,బాషా గారు మోహిద్దెదీన్ ,వరాలమ్మ్
,పరదేసి , వాసుదేవరావు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *