వార్డు సచివాలయాలను సందర్శించిన డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్.

విశాఖపట్నం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి మరియు వార్డు సచివాలయం ఉద్యోగుల పనితీరు వంటి విషయమై మహా విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ వార్డులో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ నెలలో ప్రారంభం కాబోతున్న జగనన్న వాహన మిత్ర , జగనన్న చేయూత వంటి పథకాలకు ధరకాస్తులు , లబ్దిదారుల జాబితాను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు లబ్ధిదారులకు రూ.10,000/- నగదు అందజేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సచివాలయం సెక్రటరీ నాగేశ్వర్ రావు , C.D.O సుధాకర్ రావు , R.P. లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *