విశాఖ భూములకు రెక్కలొచ్చాయ్…

 

* “మిషన్ బిల్డ్ ఏపి” పేరుతో

* విశాఖ ను సర్వనాశనం చేస్తారా ?

* సీపీఐ పార్టీ కార్యదర్శి ఎం.పైడిరాజు
మండిపాటు

విశాఖ :- విశాఖ భూములకు రెక్కలొచ్చాయ్ 213 ఎకరాలు కోదవకు సిద్ధం. విశాఖపట్నంలో అత్యంత విలువైన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, టర్నర్ చౌల్ట్రీ లో ఉన్న మహారాణి పేట,విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిధి గృహంతో పాటు 15 శాఖలకు చెందిన భూములపై కన్ను వేశారు. దాదాపు 213 ఎకరాలు భూములు కొదవ బెట్టి రూ.1600 కోట్లు రుణం తేవడానికి సిద్ధమయ్యారు,అంటే ఇంక ఆ విలువైన సంపద మర్చిపోవడమే. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఐ విశాఖ నగర కార్యదర్శి ఎం. పైడిరాజు మండిపడ్డారు.
విశాఖను పరిపాలనా రాజధాని ఆని ప్రకటించిన తరువు ప్రభుత్వ భూములపైనే దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం భావి తరాలకు ఉపయోగకరమైన విలువైన ఆస్తులు అమ్మి విశాఖను నాశనం చేసే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఐక్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. తక్షణమే ఇటువంటి అప్రజాస్వామ్య విధానాలు విడనాడాలని సీపీఐ తరుపున డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *