హ్యాపీ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో అభాగ్యులకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ 

 

పెందుర్తి : హ్యాపీ ఇండియా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తాటిపూడి.వి.వి.సత్యనారాయణ ఆర్థిక సహాయంతో రెండో రోజు గురువారం సాధువులకు, బిచ్చగాళ్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, అభాగ్యులకు, మానసిక రోగులు వంద మందికి బిర్యాని ప్యాకెట్లు మరియు మంచినీళ్ల ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తాటిపూడి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అనేకమంది అభాగ్యులు ఆకలితో ఆలమటించడంతో పెందుర్తి, వేపగుంట, సింహాచలం, గోపాలపట్నం, ఎన్ఏడి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆకలితో ఉన్నవారికి ఆహారం అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే లాక్ డౌన్ ఉన్నంతవరకు తాను మధ్యాహ్నం వీరందరికీ ఆహారాన్ని అందిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథం తో ముందుకు వచ్చి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కరుణ కాలంలో ఇప్పటికే నిరుపేదలకు, వృద్ధులకు, అందులకు, దివ్యాంగులకు, పారిశుద్ధ్య కార్మికులకు, బియ్యం, కిరాణా సామాన్లు, మధ్యాహ్న భోజనం, మజ్జిగ ప్యాకెట్లు తదితర వి అందజేసినట్లు తాటిపూడి సత్యనారాయణ తెలిపారు. బిర్యానీ పంపిణీ కార్యక్రమంలో కండిపల్లి దామోదర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *