జగనన్న తోడు లబ్ధిదారులకు డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ చేతుల మీదుగా నగదు అందజేత.

విశాఖపట్నం :

జీ.వీ.ఎం.సీ 52 వ వార్డుకు సంబంధించి మొత్తంగా 5 వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న తోపుడు బండ్లు మరియు జి.వి.య.సి స్థలాల్లో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబాలకు జగనన్న తోడు పథకం బాసటగా నిలుస్తుందని మహా విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ పేర్కొన్నారు.ఈ మేరకు ఈ ఏడాది జగనన్న తోడు పథకానికి సంబంధించి లబ్ధిదారులు ప్రతి ఒక్కరికీ స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద వారి చేతుల మీదుగా రూ.10,000 /- నగదు అందజేశారు. కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ 52 వ వార్డుకు సంబంధించి సుమారు 349 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసారని , వారికి సుమారు రూ.34,90,000 /- రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.గతంతో పోలిస్తే ఈ ఏడాది చిరు వ్యాపారస్తులు ఎక్కువ శాతం జగనన్న తోడు పథకం వైపు ఆసక్తి చూపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు C.D.O సుధాకర్ రావు , ఆర్.పి లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *