నిరాశ్రయులు, నిరుపేదకు బాసటగా నిలుస్తున్న బ్లాక్ అండ్ వైట్ మీడియా వెల్ఫేర్ సొసైటీ*

విశాఖపట్నం :

బ్లాక్ అండ్ వైట్ మీడియా వెల్ఫేర్ సొసైటీ సేవలు ఉత్తరాంధ్ర లో విస్తరిస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితిలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న అనేక మందికి బాసటగా నిలిచి సొసైటీ తరపున ఆహారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రణస్థలం మండలం హైవే నుంచి పైడి భీమవరం మీదుగా పూసపాటి రేగ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షలు , కార్యదర్శులు పిళ్ళా కనక మోహన్, శ్రీహరి పాల్గొని కరోనా కర్ఫ్యూ కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడుతున్న లారీ డ్రైవర్ లకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వీరితో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఆహరం అందజేశారు. అనంతరం పిళ్ళా కనకమోహన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని పెంపొందించుకుని ఈ కరోనా కష్టకాలం లో ఇటువంటి వారికి అండగా నిలవాలని కోరారు.తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అండ్ వైట్ మీడియా సొసైటీ ఉపాధ్యక్షులు జానకి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *