స్వాంతన సేవా సమితి ఆధ్వర్యంలోనిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి

విశాఖపట్నం :జీవీఎంసీ 57 వ వార్డు దుర్గాపురం పరిసర ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను స్వాంతన సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహా విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ మరియు 57 వార్డు కార్పొరేటర్ మూర్రు వాని నానిజి హాజరయ్యారు .కార్యక్రమంలో స్వాంతన సేవా సంస్థ వారు సుమారు 50 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ స్వాంతన సేవా సంస్థ వారు చేసిన కార్యక్రమం అభినందనీయమని కరోనా పరిస్థితులు ఏర్పడడం వల్ల దాదాపు చాలా నిరుపేద కుటుంబాలు ఉపాధి కోల్పోయారని వారికి అండగా ఈరోజు స్వాంతన సేవ సంస్థ వారు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వాంతన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *