* స్కిం కేంద్రానిది పబ్లిసిటీ రాష్ట్రానిది

* ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వతంత్ర లేని రాష్ట్రం

* ప్రశ్నిస్తే కేసులా?

* విచక్షణ కోల్పోతున్న జీవీఎంసీ అధికారులు

* శనివారం వస్తే కూల్చివేతే పనిగా పెట్టుకున్నారు

* ఆటస్థలం కోసం మానసిక, దివ్యంగుల స్కూల్ కూల్చేస్తారా?

విశాఖపట్నం :- రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యంపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.
రాష్ట్రంలో రైతు సమస్యలను పరిస్కారం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందంటం, రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా బీజేపీ కార్యలయంలో ఆందోళన చేపట్టారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు ధాన్యం కొనుగోలు లో నిర్ణయించిన ధర రూ. 1450 కానీ రూ. 1100 లోపే ధాన్యం కొనుగోలు జరుగుతోందని, రైతు భరోసా ద్వారా రూ. 15000 రూపాయిలు ఇస్తామని రూ. 7500 మాత్రమే ఇస్తుందని, జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ఎద్దేవ చేశారు. బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ప్రజా వేదిక కుల్చడం ద్వారా ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మానసిక వికలాంగులు స్కూలును కూల్చే వరకు వచ్చిందన్నారు. 190 మందితో ఒక వ్యక్తి మానసిక,దివ్యంగుల పిల్లలు కోసం హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్ నడుపుతున్నారు.
దానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాలి, కానీ ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తుంటే జివిఎంసి అధికారులకు మెంటల్ వచ్చిందేమో అర్థం కావడం లేదు గాని
190..మానసిక విద్యార్థులు ఆశ్రయం పొందే స్కూల్ ని కూల్చి వేశారు. అధికార మదంతో కొంత మంది జీవీఎంసీ అధికారులు విర్రవీగుతున్నారు. వీరి వల్ల
సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. జీవీఎంసీ అధికారులు మనుషులులా కాకా పశువులా వ్యహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల తో విచక్షణ కోల్పోతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్ యజమాని శ్రీనివాసరావు కి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

తెరవెనుక పాత్ర ఎవరిది:-

హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల స్కూల్ నిర్మాణాల కూల్చివేత, సీజ్ చేసిన వ్యవహారంలో తెరవెనుక పాత్ర దారులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ ఎన్నికలకు ముందే దీనికి బీజం పడినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి భర్త ఈ స్థలంపై కన్నేసినట్లు వెల్లడిస్తున్నారు. పార్కు, మైదానం పేరుతో ఈ వికలాంగుల పాఠశాల స్వాధీనం చేసుకోవాలనే అప్పట్లో జివిఎంసి పై ఒత్తిడి తెచ్చారు, దీంతో అప్పుడు కమిషనర్ కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్వాధీన పర్వం సాగినట్లు సమాచారం, దీనికి నియోజకవర్గ నాయకులు కూడా ఆ కార్పొరేటర్ భర్తకు వంత పాడినట్లు తెలిసింది. దీంతో రాజకీయ ఒత్తిడి తో జీవీఎంసీ చర్యకు పూనుకుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన ఆటల స్థలం కోసం మానసిక,వికలాంగులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే స్కూల్ స్థలమే కావాలా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో టాక్స్ లు పెంచడం సరికాదు

కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు హౌస్ టాక్స్ పెంచడానికి సన్నాహాలు చేయడం సరికాదు. ఇప్పటికే ఆర్థికంగా కృంగిపోయిన ప్రజలకు పక్క రాష్టాల మాదిరిగా మూడు నెలలు టెక్స్ రద్దు చెయ్యండి.లేకపోతే ఉరుకోండి అంతేగాని ఇటువంటి సమయంలో సంవత్సరం పాటు టాక్స్ పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. సంక్షేమ పథకాలు మీ సొమ్ము ఉంటే పెట్టండి అంతే గాని ఖజానా ఖాళీ చేసి హౌస్ టాక్స్, కరెంట్ రూపంలో పెంచడం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *