ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ యువ హీరో..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ”ఆదిపురుష్” అనే మైథలాజికల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ టెక్నాలజీలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తోంది. అలానే రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ ఈ పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాడని రూమర్స్ వస్తున్నాయి.యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ‘ఆదిపురుష్’ చిత్రంలో  ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటిస్తున్నది నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఇకపోతే కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ చిత్రంలో రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఏకాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో సుమారు 60 రోజుల పాటు షూటింగ్ జరిపారు. జూలై లో హైదరాబాద్ లో ఈ సినిమా స్షూట్ తిరిగి ప్రారంభం కానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *