• చెన్నైలోని ఇంజంబాకమ్ లో నివసిస్తున్న అజిత్
  • అజిత్ ఇంట్లో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్
  • అజిత్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు
  • బాంబు లేదని తేలిన వైనం
  • గతేడాది కూడా అజిత్ ఇంటికి బెదిరింపు

కోలీవుడ్ నటుల ఇళ్లకు బాంబు బెదిరింపులు తరచుగా వస్తున్న నేపథ్యంలో, హీరో అజిత్ ఇంటికి రెండు రోజుల క్రితం మరోసారి బాంబు బెదిరింపు వచ్చిన సంగతి విదితమే. అజిత్ చెన్నైలోని ఇంజంబాకమ్ లో నివసిస్తుంటారు. అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు తమిళనాడు పోలీసు కంట్రోల్ రూమ్ కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పోలీసులు వెంటనే హీరో అజిత్ నివాసానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని తేలడంతో, ఫోన్ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకుని, ఆ వ్యక్తిని గుర్తించారు.చెన్నై నగరంలో మరక్కణ్ణమ్ ప్రాంతంలో ఉండే దినేశ్ అనే యువకుడు ఈ ఫోన్ కాల్ చేసినట్టు తేలింది. అయితే దినేశ్ కు మతిస్థిమితం లేదని గుర్తించారు. దినేశ్ గతంలోనూ ఇలాంటి ఫోన్ కాల్స్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అజిత్ ఇంటికి గతంలోనూ ఓసారి బాంబు బెదిరింపు వచ్చింది. గత సంవత్సరం భువనేశ్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్టు గుర్తించారు.