• లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలు
  • ఆహారాన్ని అందిస్తున్న షకీలా
  • షకీలాపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కరోనా కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఎందరో సినీ సెలబ్రిటీలు నిలుస్తున్నారు. ఎందరికో ఆపన్నహస్తాన్ని చాస్తూ… తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి షకీలా కూడా ప్రజా సేవ కోసం ముందుకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక… ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో, అలాంటి వారి ఆకలి తీర్చడానికి ఆమె ముందుకు వచ్చారు.ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆమె పేద ప్రజల కోసం ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మనకున్న రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, రెండో చేతిని పేదలకు సాయం చేయడం కోసం వాడాలని కోరా