బతుకుదెరువు కోసం కార్పెంటర్ గా మారిన వరల్డ్ ఛాంపియన్

ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్ జేవియర్ డోహెర్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పొట్టకూటి కోసం కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన సమయంలో ఈ పని చేస్తున్నట్లు తెలిపాడు.  కాలం కలిసిరాక పోవడం వల్ల క్రికెట్ లో పెద్దగా రాణించలేదు. ఇక అవకాశాలు రాక బతుకుదెరువు కోసం పని చేయాలని భావించాడు. అలా ఈ వృత్తిలోకి అడుగుపెట్టాడు.డోహెర్టీ ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం ముందుకొచ్చింది. తాము సాయం చేస్తామంటూ ప్రకటించింది. అందుకు డోహెర్టీ నిరాకరించాడు. తనకు ఎలాంటి సాయం అక్కర్లేదని స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం చాలా హుషారుగా పని చేసుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆసీస్ క్రికెటర్ల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఆ వీడియోను క్రికెటర్ల సంఘం ట్వీట్ చేసింది.కార్పెంటర్ పనిలో భాగంగా రోజూ వివిధ ప్రదేశాలకు వెళ్తూ తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నట్లు వెల్లడించాడు. క్రికెట్ కు పూర్తిగా భిన్నమైన రంగం ఇది అని అన్నాడు. ఆటకు గుడ్ చెప్పిన తర్వాత ఏడాది పాటు ల్యాండ్ స్కేపింగ్ ఆసీస్ వర్క్స్ క్రికెట్ వర్క్స్ ఇలా చాలా పనులు చేశానని చెప్పాడు. కానీ కార్పెంటర్ వృత్తిలో కిక్ అనిపించిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఎవరీ సాయం అక్కర్లేదు అంటూ తన పరిస్థితిని వివరించాడు.2001-02లో దేశవాళీ క్రికెట్ తో అరంగేట్రం చేసిన డోహెర్టీ… 17 తర్వాత ఆటకు గుడ్ బై చెప్పాడు.  2015లో ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో ఏకైక మ్యాచ్ ఆడాడు. ఏడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. 60 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆయన కెరియర్ లో 60 వన్డేలు నాలుగు టెస్టులు ఆడాడు. మొత్తం 55 వికెట్లు తీశాడు. చివరిసారిగా భారత్ తో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు 176 లిస్ట్ ఏ 74టీ20లు ఆడి 415 వికెట్లు తీశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *